Thursday, May 1, 2025

అధ్యక్ష పదవి రెండు మూడు రోజుల ముచ్చటే?: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ ముంబయికి వెళ్లనున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి రెండు మూడు రోజుల ముచ్చటే అంటూ సన్నిహితుల వద్ద సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. వరంగల్‌ లో జరిగే బిజెపి మీటింగ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో అధ్యక్ష హోదాలో హాజరవుతానో లేదో అంటూ నిర్వేదంగా మాట్లాడినట్టు సమాచారం. ముంబయిలో ముంబాదేవిని దర్శించుకుని అక్కడ నుంచి సంజయ్ ఢిల్లీకి పయనమవుతారు. బండి సంజయ్ కు కేంద్ర మంత్రి  పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: స్మగ్లర్ పొట్టలో 43 హెరాయిన్ క్యాప్సూల్స్: వెలికితీసిన డిఆర్‌ఐ అధికారులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News