Tuesday, May 7, 2024

కెసిఆర్‌ది రాచరిక పాలన కాదు.. జనరంజక పాలన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్‌ది రాచరిక పాలన కాదు..జనరంజక పాలన అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభలో పాల్గొని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, పేద ప్రజలను దోచుకుందని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బిఆర్‌ఎస్ నేతలు రాహుల్ గాంధీపై మండిపడుతున్నారు.

సోమవారం బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మంత్రి వేముల మాట్లుడుతూ.. ”బిఆర్‌ఎస్ ఎవరికి బీ టీమ్ కాదు.. ప్రజల టీమ్ మాత్రమే. ఖమ్మం సభలో రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారు. కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు. రైతు భీమా, పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అప్పుడు ఎందుకు అమలు చేయలేదు. పింఛన్ రూ. 4వేలు అంటూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రూ.4 వేల పింఛన్ అమలు చేసే దమ్ము మీకుందా. ఏ హోదా ఉందని ఖమ్మం సభలో రాహుల్ మాట్లాడి వెళ్లారు. రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తే..రూ.లక్ష కోట్లు అవినీతి అని మాట్లాడుతున్నారు.రాహుల్ గాంధీ ఏ హోదా ఉందని ఖమ్మం సభలో మాట్లాడి వెళ్లారు” అని ప్రశ్నించారు.

Also Read: పార్టీ వీడిన నేతలంతా తిరిగి రావాలి: రాహుల్ గాంధీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News