చర్చల ప్రసక్తే లేదు.. లొంగిపోవలసిందే అమాయకులను, గిరిజనులను
కాల్చి చంపడాన్ని సామాజిక కోణంలో చూడాలనడం పద్ధతేనా? రేవంత్,
కెసిఆర్ వ్యాఖ్యలు ద్వంద్వ నీతికి నిదర్శనం: కేంద్ర మంత్రి బండి సంజయ్
మన తెలంగాణ/కరీంనగర్ రూరల్: “మావోయిస్టులతో మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవ్. నిషేధిత సంస్థతో చర్చల ప్రసక్తే లేదు.. వాళ్లు తు పాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిం దే.. వాళ్ల ప్రవర్తన మార్చుకోవాల్సిందే.”అని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్తపల్లిలో ఆదివారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించిన అనంతరం ఆయ న విలేఖరులతో మాట్లాడుతూ.. మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంతో చూడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆపరేషన్ కగార్‌ను ఆపాలంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. “తుపాకులు చేతపట్టి అమాయక ప్రజలను, గిరిజనులను కా ల్చి చంపడాన్ని సామాజిక కోణంతో చూడాలనడం ఏం పద్ధతి. బాంబులు (క్లైమో ర్ మైన్స్) అమర్చి పోలీసులను తునాతునకలు చేసి చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలా? అసలు మావోయిస్టులపై నిషేధం విధించిందే కాంగ్రెస్ పాలకులు కదా? ఇప్పుడు సామాజిక కోణం, చర్చలంటూ సన్నా యి నొక్కులు నొక్కడమేంది? ఎంతోమంది ప్రజలను, గిరిజనులను, పోలీసులను కాల్చిచంపినప్పుడు మీకు ఈ విషయం గుర్తుకు రాలే దా?”అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. ‘ఆపరేషన్ కగార్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డూరం. నక్సల్స్ సమస్యను సామాజిక కోణంతో చూస్తున్నామని చెప్పడమేంది? ఇదెక్కడి పద్ధతి? మావోయిస్టుల చేతిలో తుపాకులున్నాయి. గిరిజనులను, అమాయకులను కాల్చి చంపుతున్నారు. బాంబులు పెట్టి పోలీసులను చంపుతున్నారు. ఇంత జరుగుతుంటే సామాజిక కోణంతో చూడాలని చెప్పడమేంది? కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా మావోయిస్టులను నిషేధించింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ కాంగ్రెస్ నాయకులే నక్సల్స్‌తో చర్చలు జరపాలని చెప్పడం వాళ్ల ద్వంద్వనీతికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. “అసలు ఇక్కడ మావోయిస్టులపై నిషేధం ఉంది కదా? నిషేధం విధించింది ఇక్కడి పాలకులే కదా.
మరి మావోయిస్టులపై నిషేధం తొలగించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? సమాధానం చెప్పా లి. నిషేధం తొలగించకుండా, తుపాకీ పట్టుకొని అమాయకులను కాల్చి చంపుతున్నోళ్లతోని చర్చలేంది? గిరిజనుల చేతిలో తుపాకులుండవ్ కదా? వాళ్లు ఎవరినీ చంపరు. వాళ్లు మనుషులను చంపడానికి బాంబులు పెట్టరు. అవన్నీ చేసేది మావోయిస్టులే. ఆ నిషేధిత సంస్థతో ప్రభుత్వం ఎట్లా చర్చలు జరుపుతుంది’ అని ప్రశ్నించారు. ‘కెసిఆర్ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తడు. మళ్లా కనబడడు. కెసిఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి పోటీ పడి నక్సల్స్ గురించి మాట్లాడుతున్నరు’ అని మండిపడ్డారు. ‘మహాముత్తారంలో ఎస్‌ఐ భార్య సీమంతం చేసుకునే సమయంలో బాంబులు పెట్టి నక్సల్స్ ఆ ఎస్‌ఐని చంపేశారు. అప్పుడే కానిస్టేబుల్‌ను చంపేశారు. దూరదర్శన్ జర్నలిస్టును చంపేశారు. బిజెపి నాయకులు సామ జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, రామన్న గోపన్నను చంపేశారు. అం తెందుకు మీ కాంగ్రెస్ నాయకులను ఎంతో మం ది చంపేశారు.
శ్రీపాదరావు వంటి అజాత శత్రువును కూడా నక్సల్స్ చంపేశారు. కెసిఆర్ టిడిపిలో ఉండగా ఆ పార్టీ నాయకులను ఎంతోమందిని నక్సల్స్ చంపేశారు. అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు. బాంబులు అమర్చి పోలీసులను తునాతునకలు చేసి నక్సల్స్ చంపుతుంటే రేవంత్ రెడ్డి, కెసిఆర్ సమర్ధిస్తారా?..గిరిజనులను, అమాయక ప్రజలను ఇన్ ఫార్మర్ల పేరుతో కాల్చి చంపుతుంటే సమర్ధిస్తారా? సమాధానం చెప్పాలి’ అని అన్నారు. ‘మేం మాత్రం మావోలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు. తుపాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. వారి వైఖరి మారాల్సిందే. వాళ్లతో చర్చలు జరిపే సందర్భమే రాదు. పాకిస్థాన్ పౌరులను తిరిగి పంపే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దేశమంతా ఈ విషయంపై సీరియస్‌గా చర్చలు జరుగుతున్నాయి’ అని అన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం సరికాదు. ఇప్పటికీ చాలామంది పాస్ పోర్టు, వీసాల్లేకుండా ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారముంది.
రోహింగ్యాలు చాలామంది ఇక్కడే నివసిస్తున్నారు’ అని అన్నారు. 6 గ్యారంటీల వైఫల్యాలపై మాట్లాడకుండా బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను కాపాడుతోందని, ఇప్పుడు ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతూ ప్రజా సమస్యలను, 6 గ్యారంటీలను దారిమళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరమని అన్నారు. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణనకు పొంతనే ఉండదని. కాంగ్రెస్ కులగణనతో బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. 52 శాతం జనాభా ఉన్న బిసిలను 46 శాతంగా చూపారని, 42 శాతం రిజర్వేషన్లు బిసిలకు అమలు చేస్తున్నామని చెప్పి…అందులో నుండి 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కేటాయించారని విమర్శించారు.
నిజానికి కాంగ్రెస్ బిసిలకు 32 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానంటోందని, అయినా ఇప్పటికే మోదీ ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని, ఇక కాంగ్రెస్ చేసిందేముందని ఎద్దేవా చేశారు. బిసిల జనాభాను తగ్గించి చూపారని, అందుకే కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్‌రావు, మాజీ ఎంపిపి వాసాల రమేష్, కమిటీ సభ్యులు స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, అనుమల్ల సత్యనారాయణ, కమటం రాజేశం, వేముల సాగర్, స్వర్గం శంకరయ్య, గుండేటి విశ్వనాథం, పొన్నం సత్యనారాయణ, రుద్రరాజు, విగ్రహ దాత గుంటుక వంశీ, మెరుగు సుభాష్, చిట్కురి శ్రీనివాస్, ఖాజా ఖాన్, నరాల రాజకుమార్, మెరుగు మల్లేశం, కారం రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.