Wednesday, April 24, 2024

బడ్జెట్‌లో సరుకు లేదు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్ధిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సరుకు లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంకెల గారడీతో బడ్జెట్ అంతా గందరగోళంగా ఉందన్నారు. బడ్జెట్ ఉన్న డొల్లతనం కనిపిస్తూ ఎన్నికల స్టంట్‌ను తలపించిందని విమర్శించారు. శుష్క వాగ్దానాలు శూన్యహస్తేలే ఆత్మస్తుతి పరనింద మాదిరిగా కేంద్రాన్ని తిట్టడం రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడం తప్పితే వేరే సంగతులేమీ లేవన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో, వివిధ సందర్భల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండిచేయి చూపేలా ఉందన్నారు.

బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదన్నారు. రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ.1.31 లక్షల కోట్లుగానే చూపించిందన్నారు. మిగిలిన రూ1.60 లక్షల కోట్లు ఎక్కడ నుంచి సమకూరుస్తారో చెప్పకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆదాయానికి, కేటాయింపులకు, ఖర్చులకు ఏ మాత్రం పొంతన ఈ బడ్జెట్‌లో కనిపించడం లేదన్నారు. ఉద్యోగులకు ప్రతినెల ఏరోజున జీతాలు ఇస్తారో బడ్జెట్‌లో పేర్కొనలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News