Monday, June 17, 2024

బెంగళూరు రేవ్ పార్టీలో కదులుతున్న డొంక

- Advertisement -
- Advertisement -

ఏపి మంత్రి కాకాణి అనుచరుడి అరెస్టు

బెంగళూరు: రేవ్ పార్టీ కేసులో నగర నేర నియంత్రణ దళం(సిసిబి) దర్యాప్తు వేగం పెంచింది. ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. విచారణను ఎదుర్కొంటున్న వారిలో ఆంద్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాయచోటి వైసిపి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అనుచరులు కొందరు ఉన్నారు.

రేవ్ పార్టీలో మంత్రి కాకాణి పేరుతో ఉన్న స్టిక్కర్ కారును సిసిబి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా హైదరాబాద్ కు చెందిన పూర్ణా రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీలో అతడే ప్రముఖ పాత్ర పోషించాడని, ఆయన మంత్రి అనుచరుడేనని పోలీసులు ధ్రువీకరించారు.

ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు సినీ నటి హేమ సహా మొత్తం ఎనిమిది మందికి సిసిబి పోలీసులు శనివారం నోటీసులు జారీచేశారు. ఈ నెల 27న (సోమవారం) విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో వైద్య పరీక్ష ప్రకారం 59 మంది పురుషులు, 27 మంది యువతులు డ్రగ్స్ తీసుకున్నారని రుజువయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News