Monday, June 17, 2024

రాజ్ కోట్ గేమింగ్ జోన్ కు అగ్నిమాపక శాఖ పర్మిట్ లేదు

- Advertisement -
- Advertisement -

గుజరాత్ లోని రాజ్ కోట్ గేమింగ్ జోన్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి తొమ్మిది మంది పిల్లలతో సహా 28 మంది చనిపోయారు. ఆ గేమింగ్ జోన్ కు ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’ కూడా లేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. పైగా ఆ జోన్ కు రాను, పోను ఒకే దారి ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గేమింగ్ జోన్ ఓనర్, మేనేజర్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. అగ్నిప్రమాదంలో మృతుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. కాగా బాధితు బంధువుల నుంచి గుర్తింపు కోసం డిఎన్ ఏ సేకరించారు.   గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘటనాస్థలిని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ తర్వాత పటేల్ తో మాట్లాడారు. ముఖ్యమంత్రి చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి అదనపు డిజిపి సుభాష్ త్రివేది నాయకత్వం వహిస్తున్నారు.  ఈ బృందం ఘటనపై విచారణ జరిపి 72 గంటల్లో రిపోర్టును ఇవ్వాల్సి ఉంది.

Gujarat 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News