Friday, September 13, 2024

బంగ్లాను తక్కువ అంచనా వేయలేం : పంత్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తమకు సవాల్ వంటిదేనని భారత స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడూ ఒత్తిడి ఉంటుందని, ఏ సిరీను తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదన్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసిన విషయాన్ని రిషబ్ గుర్తు చేశాడు. ఇలాంటి స్థితిలో భారత్‌తో జరిగే పోరులోనూ బంగ్లాదేశ్ మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లాదేశ్ సమతూకంగా ఉందన్నాడు.

దీంతో తమకు బంగ్లా సిరీస్ కీలకంగా మారిందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ జట్టును కూడా తేలిగ్గా తీసుకోకూడదన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించేటప్పుడూ ప్రతి ఆటగాడు సర్వం ఒడ్డి ఆడతాడని, దీంతో ఫలితాలు తరచూ తారుమారు అవుతూనే ఉంటాయన్నాడు. అయితే తాము మాత్రం బంగ్లాతో సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామన్నాడు. సమష్టిగా రాణించి సిరీస్‌ను దక్కించుకుంటామనే నమ్మకాన్ని రిషబ్ వ్యక్తం చేశాడు. దులీప్ ట్రోఫీలో ఇండియాబికు ప్రాతినిథ్యం వహిస్తున్న రిషబ్ పంత్ ఓ ఇంటర్వూలో ఈ విషయాలు వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News