Friday, September 20, 2024

తొలిరోజు బౌలర్ల హవా..

- Advertisement -
- Advertisement -

అనంతపురం: ఇండియాసి, ఇండియాడి జట్ల మధ్య అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో గురువారం తొలి రోజు బౌలర్ల హవా నడిచింది. తొలుత బ్యాటింగ్ చేసి న ఇండియాడి టీమ్ 48.3 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అక్షర్ 118 బంతుల్లో ఆరు ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు సాధించాడు. మిగతావారు ఘోరంగా విఫలమయ్యా రు. దీంతో ఇండియాడి స్కోరు 164 పరుగులకే పరిమితమైంది.

ప్రత్యర్థి జట్టు బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ మూడు, అన్షుల్ కంబో బ్, హిమాన్షు చౌహాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఇండియాసి టీమ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 4 వికెట్లకు 91 పరుగులు చేసింది. అభిషేక్ పొరెల్ 32(బ్యాటింగ్) జట్టుకు అండగా నిలిచాడు. బాబా ఇంద్రజీత్ 15 (బ్యాటింగ్) అతనికి సహకారం అందిస్తున్నాడు. మిగతావారిలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7) పరుగులు చేశారు. ఆర్యన్ జుయల్ (12), రజత్ పటిదార్ (13) కూడా విఫలమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News