Saturday, September 21, 2024

శ్రేయస్ ఔట్… ఇండియా-డి 140/3

- Advertisement -
- Advertisement -

అనంతపురం: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా -సి, ఇండియా-డి జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇండియా డి జట్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు 24 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఇండియా డి జట్టు 136 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. శ్రేయస్ అయ్యర్ 44 బంతుల్లో 54 పరుగులు చేసి అన్షుల్ బౌలింగ్‌లో రుతరాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యాశ్ దుబే ఐదు పరుగులు చేసి విజయ్ కుమార్ బౌలింగ్‌లో ఎల్‌బి డబ్లు రూపంలో ఔటయ్యాడు. అథర్వ టైడ్ 15 పరుగులు చేసి విజయ్ కుమార్ బౌలింగ్ అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో దేవదూత్ పడిక్కల్(42), రికీ భూయ్(21) లు ఉన్నారు.
ఇండియా-డి తొలి ఇన్నింగ్స్: 164
ఇండియా-సి తొలి ఇన్నింగ్స్: 168

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News