Wednesday, April 2, 2025

నటుడు సల్మాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం…పాపం గాయపడ్డాడు!

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై  సర్వత్రా చర్చ జరుగుతోంది. ముంబైలో ఓ ఈవెంట్లో ఆయన సీటు మీద నుంచి లేవడం కూడా కష్టమైనట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఆయనకు పక్కటెముకలు దెబ్బతిన్నాయని సమాచారం. అయినప్పటికీ ఆయన టివి షో ‘బిగ్ బాస్ 18’ కి నిన్న(గురువారం) వచ్చారు. తన పని విషయంలో ఎంత కమిట్మెంట్ ఉందో తార్కాణం ఇది.

సల్మాన్ ఖాన్ పపరాజ్జీ లతో ముచ్చటిస్తూ‘రెండు ఎముకలు విరిగాయి’(దో పస్లియా టూటి హై) అన్నారు. ‘ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది?’ అని ప్రశ్నించినప్పుడు కూడా ఆయన స్నేహపూర్వకంగా జవాబిచ్చారు. ఆయన ఫోటోలు తీసుకుని పపరాజ్జీలు ఆయనకు దారిచ్చారు. పైగా ‘థాంక్స్’ కూడా చెప్పారు.

తన తదుపరి చిత్రంలో నటిస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ కు గాయమైంది. ఆ సినిమాను సికందర్ తీస్తున్నారు. ఆ సినిమా ఏఆర్. మురుగాదాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. చాలా ప్రమాదకర సీన్ నటించొద్దని అంటున్నప్పటికీ ఆయన రిస్క్ తీసుకుని నటించారు. దాంతో గాయపడ్డారు. సల్మాన్ ఖాన్ విమానంలో ఉండగా, స్టంట్ సీన్ అది. 33000 అడుగుల ఎత్తులో ఆ సీన్ చిత్రీకరిస్తుండగా సల్మాన్ ఖాన్ గాయపడ్డారు. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సల్మాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన పునరారోగ్యంతో మళ్లీ నటించాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News