Wednesday, June 19, 2024

బంగ్లాదేశ్ ఎంపీని చాలా ఘోరంగా చంపారు

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: ఇండియాలో ఇటీవల హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం అనార్ కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సిఐడి పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకుంది. వారిలో ఒకడు హత్య ఎలా చేసింది పోలీసులకు తెలిపాడు. బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తరుజ్జామన్ ఆదేశాలతోనే తనతో పాటు మరి నలుగురు బంగ్లా జాతీయులు ఈ హత్యలో పాల్గొన్నట్లు తెలిపాడు.

ఎంపీని గొంతు నులిమి చంపామని అతడు పేర్కొన్నాడు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు చర్మం ఒలిచామని, ముక్కముక్కలు చేసినట్టు చెప్పాడు. ఆ ముక్కలను  ప్లాస్టిక్ కవర్లలో పెట్టి నలువైపులా పడేసినట్లు వివరించాడు.

ఇదిలావుండగా ఆ బంగ్లాదేశ్ ఎంపీని హనీ ట్రాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. టౌన్ హాల్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లోకి ఇద్దరు పురుషులు, ఓ మహిళ వెళ్లిన సిసిటివి దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.

బంగ్లాదేశ్ ఎంపీ హత్య ఎందుకు జరిగిందన్నది ఇంకా తేలాల్సి ఉంది. పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News