Tuesday, April 16, 2024

జనవరి 31 నుంచి బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె

- Advertisement -
- Advertisement -

Banks

న్యూఢిల్లీ: వేతన సవరణపై భారతీయ బ్యాంకుల సంఘం(ఐబిఎ)తో చర్చలు విఫలు కావడంతో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు సంఘాలు గురువారం పిలుపునిచ్చాయి. వీటితోపాటు మార్చిలో మూడు రోజులు సమ్మె చేస్తామని బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. వేతన సవరణ సమస్యను త్వరితంగా పరిష్కరించాలని కోరుతూ వచ్చే మూడు నెలలు వివిధ దశలలో సమ్మె చేపట్టాలని తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం తెలిపింది. జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీతోపాటు మార్చి 11, 12, 13 తేదీలలో సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. 2017 నవంబర్ 1 నుంచి వేతన సవరణ సమస్యల పరిష్కారానికై ఉద్యోగ సంఘాలు డిమాండు చేస్తున్నాయి.

Banks to go strike on Jan 31, Feb 1, The Bank Associations have decided to went on strike on March 11, 12, 13 for three days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News