Wednesday, April 24, 2024

నిర్భయ కేసు: దోషులకు ఉరి అమలుకు తొలగిన అడ్డంకులు

- Advertisement -
- Advertisement -

Nirbhaya-case

న్యూఢిల్లీ: నిర్భయ దోషులలో ఒకడైన ముకేష్ దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం గురువారం తిరస్కరించింది. దీంతోఈ క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పంపించారు. 2012లో జరిగిన నిర్భయ హత్యాచార కేసులో దోషులలో ఒకడైన ముకేష్ సింగ్ ఇదివరకే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. కాగా, ముకేష్ సింగ్‌తోపాటు వినయ్ కుమార్ అనే మరో దోషి పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. ఉరిశిక్షను ఎదుర్కోనున్న ఖైదీలకు చిట్టచివరి ఉపశమనంగా పరిగణించే క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్భయ కేసులో దోషులైన నలుగురికి జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు కానున్నది.

Delhi govt rejects Mercy plea of Mukesh Singh, Death sentence will be implemented on Jan 22 in Tihar Jail for Nirbhaya rape convicts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News