Tuesday, April 30, 2024

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు సూత్రధారి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో సూత్రధారి సహా ఇద్దరిని జాతీయ నేర పరిశోధన శాఖ(ఎన్ఐఏ) అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. ముస్సవీర్ హుసైన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా లు కోల్ కతాలో వారు దాగున్న ప్రదేశంలో ఎన్ఐఏ టీమ్ వారిని పట్టుకుందని అధికారులు తెలిపారు. బెంగళూరు కేఫ్ లో షాజిబ్ ఇంప్రోవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్(ఐఈడి) పెట్టగా, ప్రణాళిక రచించింది, నిర్వహించిన కీలక సూత్రధారి మాత్రం తాహా అని వారు తెలిపారు.

శుక్రవారం తెల్లవారు జామున తప్పించుకు తిరుగుతున్న వారిని, కోల్ కతా వద్ద వారు తప్పుడు ఐడెంటీటితో  దాగున్న ప్రదేశంలో వారిని ఎన్ఐఏ బృందం పట్టుకుంది. వారిని పట్టుకోవడంలో పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్నాటక, కేరళ పోలీసులు ఎన్ఐఏకు సహకరించారని అధికారులు వెల్లడించారు. ఆ ఇద్దరి ఆచూకీ తెలిపితే వారిలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రివార్డు కూడా ఇస్తామని ఎన్ఐఏ గత నెలలోనే ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News