Tuesday, April 30, 2024

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు

- Advertisement -
- Advertisement -

కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్
కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయి
సికింద్రాబాద్ రోడ్‌షోలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే దేశంలో మళ్లీ కుటుంబ పాలన వ స్తుందన్నారు. పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు దాటినా హామీల అమలు ఊసేలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలన్నారు.

మోడీ హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారమైందని వెల్లడించారు. ఎయిర్‌పోర్టులు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రంలో బిజెపి మ రోసారి గెలవడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎంపై తీరుపై కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఆ మూడు పార్టీల

డిఎన్‌ఎ ఒక్కటేనని విమర్శించారు. గత ప్రభుత్వంలో దుశ్శాసన పాత్ర పోషించిన ఎంఐఎం ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ పంచన చేరిందని విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీకటి వ్యాపారాలు చేస్తూ, దౌర్జన్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పార్టీ ఎంఐఎం అని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకి ముందు కెసిఆర్‌ను ఒవైసీ మెచ్చుకున్నారని, ఆ దేశ్ కి నేతను వదిలేసి ప్లేట్ ఫిరాయించాడన్నారు. దౌర్జన్యంగా హిందువుల ఇళ్లను ఖాళీ చేయించిన చరిత్ర ఎంఐఎంది అని ఆ యన ధ్వజమెత్తారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌పై ఫోకస్ పెట్టారు.

కాంగ్రెస్, ఎంఐఎంవి కుమ్మక్కు రాజకీయాలు
కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు కుమక్కు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకు వస్తానన్నా మార్పు ఏమైందని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News