Wednesday, November 13, 2024

రూ. 10,000లోపు లభించే బెస్ట్ 5జి ఫోన్‌లు..

- Advertisement -
- Advertisement -

దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయాలని అనుకుంటారు. అందుకే కంపెనీలు ఈ పండుగ సందర్భంగా విక్రయాలను నిర్వహిస్తాయి. మీరు బెస్ట్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లైతే..మీరు దీపావళి సేల్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం బడ్జెట్ రూ. 10,000లో లభించే బెస్ట్ 5జి మొబైల్స్ గురుంచి చూద్దాం.

 

1. పోకో ఎం 6 5జి

పోకో కంపెనీకి చెందిన ఈ ఫోన్‌ను మీరు కేవలం రూ. 7,199కే సేల్‌లో పొందవచ్చు. దీని MRP రూ.11,999గా ఉంది. కానీ, విక్రయంలో రూ.7,999కి మాత్రమే కొనొచ్చు. ఇది కాకుండా..SBI బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించడం ద్వారా 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్‌లో 78,000 మందికి పైగా ఈ ఫోన్‌కు 4.2 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఫొటోస్ కొరకు 50MP బ్యాక్, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక 5000mAh బ్యాటరీ, 5G కనెక్టివిటీ కూడా ఉంది.

2. శాంసంగ్‌ గ్యాలెక్సీ ఏ14 5జి

ఈ జాబితాలో రెండవ ఫోన్ Samsung Galaxy A14 5G ఉంది. ఇది భారతదేశం నంబర్-1 5G అమ్మకపు ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ధర రూ. 20,999 గా ఉంది. అయితే, ఇది ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో రూ. 10,999కి లబిస్తోంది. ఇది కాకుండా..SBI బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించి రూ.9,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే..ఫ్లిప్‌కార్ట్‌లో 35 వేల మందికి పైగా ఈ ఫోన్‌కు 4.2 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇందులో వినియోగదారులకు ప్రీమియం బ్యాక్ డిజైన్‌తో 6.6 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే, 50MP బ్యాక్, 13MP ఫ్రంట్, 5000mAh బ్యాటరీ, 5G కనెక్టివిటీని అందించారు.

3. మోటో జీ45 5జి

మీ బడ్జెట్‌ను రూ. 1000 వరకు పెంచగలిగితే..ఈ మోటరోలా ఫోన్ మీకు గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఫోన్ MRP రూ. 14,999 గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దీనిని రూ.11,999కి విక్రయిస్తున్నారు. ఇది కాకుండా..SBI బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించి రూ.10,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే..ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు 40 వేల మంది ఈ ఫోన్‌కు 4.4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇందులో వినియోగదారులకు వేగన్ లెదర్ బ్యాక్ డిజైన్, 50MP బ్యాక్, 16MP ఫ్రంట్, 5000mAh బ్యాటరీ, 5G కనెక్టివిటీతో కూడిన 6.5 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఇవ్వబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News