Friday, March 29, 2024

అక్టోబర్‌ 15న ‘బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ ’కుకింగ్‌ పోటీల గ్రాండ్‌ ఫైనల్‌

- Advertisement -
- Advertisement -

Best Chef hyderabad cooking competition final on Oct 15

బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ లైవ్‌ కుకింగ్‌ పోటీల గ్రాండ్‌ ఫైనల్‌ కెపీహెచ్‌బీ లోని ఇందు ఫార్చ్యూన్‌ గార్డెనియా వద్ద జరుగనుంది. ఈ ఇంటర్‌ హై రైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ లైవ్‌ కుకింగ్‌ పోటీలను హైదరాబాద్‌ వ్యాప్తంగా 20 గేటెడ్‌ కమ్యూనిటీల వాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సొసైటీ నుంచి ఓ ఫైనలిస్ట్‌ ఈ గ్రాండ్‌ ఫైనల్‌లో పాల్గొంటారు. ఈ పోటీల ప్రాధమిక రౌండ్లకు అపూర్వ ఆదరణ లభించింది. దాదాపు 400 మందికి పైగా ఈ పోటీల్లో పాలుపంచుకున్నారు. ఆడిషన్‌ రౌండ్స్‌లో చిన్నారులు, యువత, పెద్దలు, సీనియర్‌ సిటిజన్లు తమ అసాధారణ పాకశాస్త్ర నైపుణ్యం ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి రత్నదీప్‌ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించడంతో పాటుగా నూతన ప్రతిభావంతుల కోసం వర్క్‌షాప్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా రత్నదీప్‌ మార్కెటింగ్‌ డైరెక్టన్‌ యష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. హోమ్‌ చెఫ్‌లు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా తమ చుట్టుపక్కల వారితో బంధాన్నీ బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ ఆయిల్స్‌ సేల్స్‌ –మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తమ సొంత ఫుడ్‌ తామే వండుకోవడంతో పాటుగా విభిన్నమైన పదార్థాలు వాడటాన్ని ప్రోత్సహిస్తుంటాము. ఈ బెస్ట్‌ చెఫ్‌ పోటీ మా ప్రయత్నాలకు కొనసాగింపు. ఈ పోటీలకు అపూర్వ ఆదరణ లభించడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఎస్‌ఐపీఎల్‌ ఈవెంట్స్‌ ఫౌండర్‌ ప్రవీణ్‌ కె అగర్వాల్‌ మాట్లాడుతూ ఫైనల్స్‌ కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News