Thursday, April 25, 2024

ఆరోగ్య తెలంగాణ

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) విస్తరణకు రూ. 1,571 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ ఆసుపత్రికి రాష్ట్రంలోని నలుమూలల నుంచే కా కుండా, పొరుగు రాష్ట్రాల నుంచి రోగు లు వస్తుంటారు.ఈ ఆస్పత్రిలో ప్రతి రోజు కొన్ని వేల మంది వైద్యం చేయించుకుంటుంటారు. నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చ ర్యలు చేపడుతోంది.

తాజాగా 2 వేల ప డకల నిమ్స్ విస్తరణ ప్రాజెక్టు కు ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే నిమ్స్‌లో1,800 పడకలు ఉండ గా, 4 వేల పడకలతో నగరం నలువైపు లా నాలుగు టిమ్స్ ఆసుపత్రులను ప్ర భుత్వం నిర్మిస్తోం ది. అలాగే వరంగల్ లో 2 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తోంది. దాంతో రాష్ట్రంలో సూపర్ స్పె షాలిటీ పడకలు 10 వేలకు చేరువ కానున్నాయి.నిమ్స్ విస్తరణలో భాగంగా2 వేల ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయనుండగా, అందులో 500 ఐసి యు పడకలు, 42 స్సెషాలిటీ విభాగా లు ఉంటాయి. వీటితోపాటు సూపర్‌స్పెషాలిటీ నర్సింగ్, అనుబంధ హెల్త్ సైన్సె స్ శిక్షణ అందుబాటులోకి రానున్నాయి.

మరో ముందడుగు

నిమ్స్‌విస్తరణకు రాష్ట్రప్రభుత్వం రూ. 1,571 కోట్ల నిధులు కేటాయించడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశా రు. ఈ మేరకు హరీశ్‌రావు ట్వీట్ చే శారు. ఆరోగ్య తెలంగాణ కోసం తీ సుకుంటున్న చర్యల్లో ఈ నిర్ణయం మరో ముందడుగు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజనరీ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజ ల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News