Saturday, March 22, 2025

డీలిమిటేషన్ పై త్వరలో అఖిలపక్షం

- Advertisement -
- Advertisement -

రాజకీయాలకు అతీతంగా అన్ని
పార్టీలూ హాజరుకావాలి త్వరలో
అఖిలపక్షం తేదీ, సమయం ఖరారు
వివిధ పార్టీలకు డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్
నేత జానారెడ్డి బహిరంగ లేఖ

డీలిమిటేషన్ పై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. త్వరలో నిర్వహించబోయే అఖిలపక్ష భేటీకి హాజరు కావాల్సిందిగా భట్టి విక్రమార్క, జానారెడ్డి బుధవారం వివిధ రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. కాగా ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ లేఖలో వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన జరగబోయే డీలిమిటేషన్ తో తెలంగాణకు అన్యాయం జరగనుందని, జరగబోయే నష్టాన్ని గురించి అన్ని పార్టీలతో చర్చించి ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరుకావాలని ఆ లేఖలో కోరారు. సమావేశానికి సంబంధించిన తేదీని, వేదికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా ఇటీవల సౌత్ లో డీలిమిటేషన్ విధానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానం వలన నష్టపోతాయని, డీలిమిటేషన్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. కొనసాగించాలనుకుంటే 1971 జనాభా ప్రాతిపదికన తీసుకోవాలని ఇటీవల తమిళనాడు కేంద్రానికి తీర్మానం పంపిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News