Saturday, March 22, 2025

19న అసెంబ్లీకి బడ్జెట్

- Advertisement -
- Advertisement -

11 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు బిఎసి సమావేశంలో
నిర్ణయం 27 వరకు బడ్జెట్ సమావేశాలు నేడు గవర్నర్ ప్రసంగానికి
ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అ సెంబ్లీ సమావేశాల పనిదినాలపై షెడ్యూల్ ఖరారైంది. 11 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటి(బిఎసి)లో నిర్ణయం తీసుకున్నారు. శాసననసబ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బుధవారం జ రిగిన బిఎసి సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 19 న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. గురువారం ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీ ర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 14న హోలీ సం దర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు(23 ఆదివారం మినహా) వివిధ పద్దులపై సభలో చర్చ చేపట్టనున్నారు.

బుధవారం బడ్జెట్ స మావేశాలు ప్రారంభం కాగా, తొలిరోజు ఉభయసభల ను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అ నంతరం శాసనసభ గురువారానికి వాయిదా పడింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బిఎసి సమావేశం జరిగింది. శాసనసభ భవనంలోని స్పీకర్ చాంబర్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బిఆర్‌ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బిజెపి పార్టీ నుంచి మహేశ్వర్ రెడ్డితోపాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సిపిఐ నుంచి కూనమనేని సాంబశివ రావు పాల్గొన్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్
మార్చి 13 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం
మార్చి 14న హోలీ సెలవు
మార్చి 15 బిసి రిజర్వేషన్లు, ఎస్‌సి వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టడం
మార్చి 16న సెలవు(ఆదివారం)
మార్చి 17,18న బిసి రిజర్వేషన్లు, ఎస్‌సి వర్గీకరణ బిల్లులపై చర్చ
మార్చి 19న బడ్జెట్
మార్చి 20న బడ్జెట్‌పై అధ్యయనానికి సెలవు
మార్చి 21, 22న బడ్జెట్‌పై సాధారణ చర్చ
మార్చి 23న సెలవు(ఆదివారం)
మార్చి 24,25,26 పద్దులపై చర్చ, ఆమోదం
మార్చి 27 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం, సభ నిరవధిక వాయిదా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News