Saturday, April 27, 2024

‘భీష్మ’ టీజర్.. నితిన్ కు హిట్ పక్కా!

- Advertisement -
- Advertisement -

ల‌వ‌ర్ బోయ్ నితిన్, యంగ్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చలో ఫేం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఇటీవ‌ల విడుదల చేసిన ఈ మూవీ పోస్ట‌ర్స్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ని చిత్రయూనిట్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ లో నితిన్ కామిడీ టైమింగ్ అదిరింది. ఈ మూవీని చాలా రిచ్ గా, ఫన్నీగా.. లవ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా రూపొందించినట్లు టీజ‌ర్ ని చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. కాగా, ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bheeshma movie teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News