Saturday, April 27, 2024

సిఎఎ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటా

- Advertisement -
- Advertisement -

Bhim-Army

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రవేశించడానికి కోర్టు అనుమతించిన దరిమిలా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బుధవారం సాయంత్రం పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా షహీన్ బాగ్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆజాద్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ రోజు సాయంత్రం షహీన్ బాగ్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలలో తాను కూడా పాల్గొనబోతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కాగా, సిఎఎకి వ్యతిరేకంగా జామా మసీదు వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించిన ఆజాద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

దాదాపు నాలుగు వారాల తర్వాత బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 11 వరకు ఆజాద్ ఢిల్లీలో ప్రవేశించకూడదని షరతు విధించింది. మంగళవారం తన బెయిల్ ఉత్తర్వును సవరించిన కోర్టు వైద్య పరీక్షలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆజాద్ ఢిల్లీకి రావడానికి అనుమతించింది. కోర్టు తాజా ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేసిన ఆజాద్ ఇది రాజ్యాంగ విజయమని తెలిపారు. తాను ఢిల్లీని సందర్శిస్తానని, దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న బిజెపి ఢిల్లీలో గద్దెనెక్కకుండా అడ్డుకుంటానని ప్రకటించారు.

Bhim Army Chief to join Shaheenbagh protests today, Chandrasekhar Azad says he will join anti CAA demonstrations at Shaheenbagh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News