Friday, September 13, 2024

అత్యాచారాయత్నం… మర్మాంగాలపై గరిటతో కొట్టిన మహిళ

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఓ మహిళపై అత్యాచారం చేయబోతుంటే కామాంధుడి మర్మాంగాలపై గరిటతో కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడిన సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భివండలో సత్యనారాయణ రచ్చ అనే వ్యక్తి మద్యం మత్తులో పక్కింట్లోకి వెళ్లాడు. పక్కింటి మహిళతో మాట్లాడుతూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ కిచెన్ రూమ్‌లోకి పరుగులు తీసింది. ఆమెపై సత్యనారాయణ అత్యాచారం చేయబోతుండగా గరిట తీసుకొని అతడి మర్మాంగాలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడు లబోదిబో మంటూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News