Tuesday, September 10, 2024

భవనం పైనుంచి శునకం పడడంతో బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలికపై భవనం పైనుంచి కుక్క పడడంతో ఆ చిన్నారి మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మూడేళ్ల బాలిక తన తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా అయిదు అంతస్తుల భవనంపై నుంచి చిన్నారిపై శునకం పడింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని పరీక్షించిన వైద్యుల తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్క కిందికి దూకిందా? ఎవరైనా పైనుంచి పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యజమాని నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News