Tuesday, September 10, 2024

క్వార్టర్స్‌లో ఓడిన టిటి టీమ్

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాన్ని భారత్ మరోసారి కోల్పోయింది. మహిళల టెబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో భారత్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జర్మనీతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ పరాజయం పాలైంది. దీంతో భారత్ పతకం రేసు నుంచి నిష్క్రమించింది. తొలుత జరిగిన డబుల్స్‌లో ఆకుల శ్రీజ, అర్చనా కామత్ జోడీ 13 తేడాతో యువాన్, జియెనా చేతిలో ఓటమి పాలైంది. తర్వాత జరిగిన తొలి సింగిల్స్‌లో మనికా బాత్రా 13 తేడాతో కౌఫ్మాన్ అన్నెట్ చేతిలో కంగుతిన్నది. అయితే మూడో సింగిల్స్‌లో అర్చనా కామత్ 31 తేడాతో షాన్ జియోనాపై విజయం సాధించింది. కానీ నాలుగో సింగిల్స్ శ్రీజ 03తో పరాజయం పాలు కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News