Monday, April 29, 2024

బైడెన్‌-మోడీ వర్చువల్ భేటీ

- Advertisement -
- Advertisement -

Biden-Modi virtual meeting

మరింత చొరవ చూపండి
ఉక్రెయిన్‌పై మోడీని కోరిన బైడెన్
చేయాల్సిందంతా చేశామన్న ప్రధాని
ఇరువురు నేతల నడుమ వార్‌టాక్

వాషింగ్టన్/న్యూఢిల్లీ : యుద్ధ తాకిడికి గురైన ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు భారతదేశం అన్ని చర్యలూ తీసుకుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఓ వైపు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి సామరస్యాలకు పాటుపడ్డామని, మరో వైపు ఉక్రెయిన్‌కు ఔషధాలు, ఇతరత్రా సహాయక సామాగ్రి అందించామని వివరించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య నేరుగా సాగుతోన్న సంప్రదింపులు ఫలిస్తాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరుల భద్రతకు , అక్కడ చిక్కుపడ్డ విదేశీయుల తరలింపునకు తమ దేశం ప్రాధాన్యత ఇచ్చిందని బైడెన్‌కు మోడీ వివరించారు.

ఇటీవలే బుచాలో అమాయక పౌరుల వధ జరిగిందని తెలిసిందని, దీని పట్ల ఆందోళన వ్యక్తం చేశామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ గర్హనీయ ఘటనపై దర్యాప్తునకు భారత్ డిమాండ్ చేస్తోందని అన్నారు. ప్రపంచ సమస్యలపై భారత్ అమెరికాల పరస్పర సాయం అవసరం అని ఇంతకు ముందు నిర్ణయానికి వచ్చిన విషయాన్ని మోడీ బైడెన్‌కు గుర్తు చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ నివారణకు భారత్ మరింత చొరవ చూపాలని బైడెన్ కోరినట్లు తరువాత అధికారిక ప్రకటన వెలువడింది. రష్యా నుంచి భారత్ చమురు సాయం విషయాన్ని బైడెన్ ప్రస్తావించారా? ప్రస్తావిస్తే మోడీ జవాబు ఏమిటనే వివరాలు వెంటనే వెలుగులోకి రాలేదు.

మో‘ఢీ’కి ఎదురుచూస్తున్నా ః బైడెన్

భారత ప్రధాని నరేంద్ర మోడీతో వర్చువల్‌గా అయినా భేటీకి తాను ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తెలిపారు. అంతర్జాతీయంగా ఆంక్షల చిక్కుల్లోకి నెట్టి ఏకాకిని చేయాలని అమెరికా భావిస్తోంది. దీనికి భారత్ నిర్ణయం గండికొట్టిందని అమెరికా తీవ్రస్థాయిలో ఇటీవలే స్పందించింది. తాను సోమవారం ఉదయం ప్రధాని మోడీతో ముచ్చటించనున్నాను. ఈ క్షణం కోసం వేచి ఉన్నానని బైడెన్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News