Sunday, April 28, 2024

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సమయంలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

Big Explosives Recovery In Pulwama

పుల్వామా : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను భారత్ ఘనంగా జరుపుకొంటున్న సమయంలో ఉగ్రవాదులు పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామాలో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలను గుర్తించిన భద్రతా దళాలు, వాటిని నిర్జీవ ప్రాంతంలో పేల్చివేశాయి. ఈ పేలుడు పదార్ధాలు దాదాపు 25 నుంచి 30 కిలోల వరకు ఉండొచ్చని జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. పుల్వామా లోని తహబ్ క్రాసింగ్ వద్ద సుమారు 25 నుంచి 30 కిలోల పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు , పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముందస్తుగా గుర్తించి పెనుప్రమాదాన్ని నివారించగలిగాం అని జమ్ముకశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఇదిలా ఉండగా, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొంటున్న వేళ ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐఎస్‌ఐఎస్ సంస్థతో సంబంధం ఉన్న సాబుద్దీన్ అనే వ్యక్తిని ఉగ్రవాద వ్యతిరేక దళం ఉత్తరప్రదేశ్ లోని అజమ్‌గఢ్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిపై ఐపీసీతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధాల చట్టానికి సంబంధించి పలు కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News