Monday, April 29, 2024

వరవరరావుకు రెగ్యులర్ బెయిలు మంజూరు

- Advertisement -
- Advertisement -

Regular bail granted to Varavara Rao

న్యూఢిల్లీ : విప్లవ రచయితల సంఘం నేత పి వరవరరావుకు సుప్రీం కోర్టు బుధవారం రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును పర్మనెంట్ బెయిలుగా మార్చింది. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న ట్రయల్ కోర్టు అధికార పరిధి లోని ప్రాంతం నుంచి వెలుపలికి వెళ్ల కూడదని షరతు విధించింది. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదని కూడా తెలిపింది. కేసు దర్యాప్తును ఏ విధంగానూ ప్రభావితం చేయరాదని, సాక్షులతో సంప్రదింపులు జరపకూడదని కూడా వివరించింది.

ఆయన వయసు 82 సంవత్సరాలు కావడం, అంతేకాకుండా అనారోగ్య పరిస్థితులు ఉండటం వల్ల వైద్యపరమైన కారణాల మేరకు ఈ బెయిలును మంజూరు చేస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. చికిత్సకు సంబంధించిన వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు తెలియజేయాలని వరవరరావును ఆదేశించింది. అంతకు ముందు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. అనారోగ్య కారణాల దృష్టా తనకు పర్మినెంట్ మెడికల్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు దులియాతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిపి, ఆయన బెయిలును పర్మనెంట్ బెయిలుగా మార్చింది. అవసరమైతే విచారణకు సహకరించాలని షరతు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News