Saturday, October 12, 2024

అత్యాచారయత్నం…. వైద్యుడు జననాంగాలను బ్లేడుతో కోసిన నర్సు

- Advertisement -
- Advertisement -

పాట్నా: నర్సుపై ఓ వైద్యుడు మరో వ్యక్తితో కలిసి అత్యాచారం చేస్తుండగా అతడి జననాంగాలను బ్లేడుతో కోసేసిన సంఘటన బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆర్‌బిఎస్ హెల్త్‌కేర్ సెంటర్‌లో ఓ నర్సు విధులు నిర్వహిస్తోంది. బుధవారం రాత్రి నర్సు విధుల్లో ఉండగా ఆమెపై వైద్యుడు, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ సంజయ్‌లు అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బ్లేడ్‌తో వైద్యుడి జననాంగాలను కోసేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పుడు ఇద్దరు నిందితులు మద్యంమత్తులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. అత్యాచారానికి ముందు సిసిటివి కెమెరాలు ఆఫ్ చేయడంతో పాటు ప్రధాని ద్వారానికి తాళం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్పత్రిలో మద్యం బాటిళ్లతో పాటు బ్లేడును, రక్తపు మరకలు ఉన్నదుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సు దైర్యంగా వ్యవహరించి ఈ దాడి నుంచి తప్పించుకుందని డిఎస్‌పి సంజయ్ పాండే కొనియాడారు. కోల్‌కతాలోని జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సంఘటన దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News