Saturday, October 12, 2024

తారక్‌కు వీరాభిమానిని అయిపోయా

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు లక్షల్లో అభిమానులున్నారు. వాళ్లలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తను కూడా చేరిపోయానంటోంది జాన్వీ కపూర్. తార క్‌తో కలిసి దేవర సినిమా చేసిన ఈ బ్యూటీ, అతడిని దగ్గ రుండి చూసిన తర్వాత వీరాభిమానిని అయిపోయానని అంటోంది. ముంబయిలో దేవర- 1 ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వి కపూర్.. సెట్స్‌లో ఎన్టీఆర్ ను చూసి చాలా నేర్చుకున్నానని తెలిపింది.

ఎన్టీఆర్ నిబద్ధత, వ్యక్తిత్వం చూసిన తర్వాత అతడికి ఫ్యాన్ అయిపోయానని పేర్కొంది. కుదిరితే తారక్‌తో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాల నుకుంటున్నానని వెల్లడించింది జాన్వీ కపూర్. ఇక ట్రైలర్‌లో జాన్వీ కపూర్ పల్లెటూరి పిల్లగా కనిపించింది. ఆమె పాత్ర పేరు ‘తంగం’. సినిమాలో ఆమెది కీలకమైన పాత్ర అనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్, జాన్వీ మీద తీసిన చుట్టమల్లే పాట బాగా వైరల్ అయింది. ఈ మాస్ స్టార్‌తో ఆమె హాట్ కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు జనం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News