Thursday, September 18, 2025

బైక్ లారీ ఢీ

- Advertisement -
- Advertisement -

మాడుగులపల్లి : బైక్ పై వెళుతూ లారీని వెనుక నుంచి ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన మాడుగులపల్లి మండల కేంద్రంలో టోల్ ప్లాజా సమీపంలో జరిగింది. మాడుగులపల్లి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం… మాతంగి సిద్దు తండ్రి హృదయ రాజు వయసు (24) బుధవారం గుంటూరు నుంచి హైదరాబాదు బయలుదేరడంతో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై మాడుగులపల్లి మండల కేంద్ర టోల్ ప్లాజా దాటగానే లారీ అజాగ్రత్తగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిర్లక్ష్యంగా నడపడం వల్ల వెనుక నుంచి బైకును ఢీ కొట్టడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బుధవారం రాత్రి 10 గంటల 40 నిమిషాలకు మరణించినాడని మృతుని మామ కంచర్ల చిట్టిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News