Friday, July 4, 2025

క్యాబినెట్ నుంచి తప్పుకుంటానని బిలావల్ భుట్టో బెదిరింపు!

- Advertisement -
- Advertisement -

కరాచీ: సింధ్ ప్రభుత్వం, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి) పట్ల ఫెడరల్ ప్రభుత్వం తన కమిట్మెంట్లను గౌరవించకపోతే కేంద్రంలో తమ పార్టీకి మంత్రిత్వ శాఖలను కొనసాగించడం కష్టమని పిపిపి చైర్మన్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. పాకిస్థాన్‌లో గత ఏడాది వరద బాధితుల సహాయానికి, పునరావాసానికి ఫెడరల్ ప్రభుత్వం సహకరించలేదని, ఇప్పటికీ తన హామీలను నెరవేర్చలేదని బిలావల్ విచారం వ్యక్తం చేసినట్లు ‘ది న్యూస్’ నివేదించింది.

వరద బాధితులను ఆదుకునేందుకు ఫెడరల్ ప్రభుత్వం వాగ్దానం చేసిన వాటాగా ఇంకా 4.7 బిలియన్లు పాకిస్థానీ రూపాయలు చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశాన్ని ఫెడరల్ క్యాబినెట్, జాతీయ అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు.

వరద బాధితులను ప్రాధాన్యత ప్రాతిపదికన ఆదుకునేందుకు సమాఖ్య ప్రభుత్వం ముందుకు వస్తే సానుకూల సందేశం పంపిస్తామని బిలావల్ అన్నారు. ‘ఫెడరల్ ప్రభుత్వం వరద బాధితులకు తన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు మమ్మల్ని నిలదీస్తారు’ అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News