Saturday, April 27, 2024

పాక్ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’

- Advertisement -
- Advertisement -

పిపిపి చైర్మన్ బిలావల్ జోస్యం
ఇతరులు తమ వైఖరి మార్చుకోక తప్పదు

ఇస్లామాబాద్ : ‘ఎవరో ఒకరు తమ వైఖరి మార్పునకు సిద్ధంగా లేకపోతే’ పాకిస్తాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’ నెలకొనవచ్చని తాను భావిస్తున్నట్లు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చైర్మన్ బిలావల్ జర్దారీ భుట్టో మంగళవారం వెల్లడించారు. పాకిస్తాన్ రాజకీయ రంగంలో ముదురుతున్న విభేదాలను ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్ఎన్), పిపిపి అగ్ర నేతల మధ్య తాజా దఫా చర్చలు సోమవారం అసంపూర్తిగా ముగిసిన మరునాడు బిలావల్ ఆ వ్యాఖ్యలు చేశారు.

ఈ నెల 8 నాటి ఎన్నికలలో మిశ్రమ ఫలితాలు రావడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అధికారం పంపకం సూత్రంపై ఉభయ పక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పిఎంఎల్ (ఎన్)కు తాము మద్దతు ఇవ్వాలంటే అధ్యక్షుడు, సెనేట్ చైర్మన్, జాతీయ అసెంబ్లీ స్పీకర్ వంటి కీలక రాజ్యాంగ పదవులను పిపిపి కోరుతున్నట్లు తెలుస్తోంది.

సుప్రీం కోర్టులో విలేకరులతో మాట్లాడిన బిలావల్ పిపిపి, తాను తమ వైఖరిపై పట్టుదలతో ఉన్నట్లు చెప్పారని, తమ వైఖరి ఎటువంటి పరిస్థితుల్లోను మారదని ఆయన స్పష్టం చేశారని‘డాన్’ వార్తాపత్రిక తెలిపింది. ‘ఎవరో ఒకరు తమ వైఖరి మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పురోగతి ఉంటుంది. వారు వైఖరి మార్పునకు సిద్ధంగా లేకపోతే ప్రతిష్టంభన నెలకొంటుందని ఊహిస్తున్నా’ అని ఆయన చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి గాని, పార్లమెంటరీ వ్యవస్థకు గాని శ్రేయోదాయకం కాదని ఆయన అన్నారు. ‘నేను పిఎంఎల్ (ఎన్)కు వోటు ఇవ్వాలనుకుంటే నా షరతులపైనే ఇవ్వవలసి ఉంటుంది. వారి షరతులపై కాదు’ అని 35 ఏళ్ల బిలావల్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News