Thursday, May 2, 2024

భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్
ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : చండీగఢ్ మేయర్ పదవికి జరిగిన ‘ప్రహసనప్రాయ ఎన్నిక’పై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదం చేస్తుందని కాంగ్రెస్ మంగళవారం వ్యాఖ్యానించింది. ‘మొత్తం ఎన్నిక ప్రక్రియ పూర్తిగా ప్రహసనంగా ఉంది. ఈ చరిత్రాత్మక తీర్పుతో ఆ వ్యవహారం బహిర్గతం అయింది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘పూర్తి వివి ప్యాట్ లెక్కింపు గురించి చర్చించేందుకు ఎన్నికల కమిషన్ నుంచి సమయం కోసం నాలుగు నెలలుగా మేము తరచు కోరుతున్నాం.

కాని కమిషన్ నుంచి మా కోసం వీలు చిక్కడం లేదు’ అని వేణుగోపాల్ తెలిపారు. ‘ఎన్నికల కమిషన్ త్వరగా కదలి, ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసం మెరుగుదలకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. వివాదాస్పద చండీగఢ్ మేయర్ పదవి ఎన్నికలో పోలైన వోట్లను తిరిగి లెక్కించాలని, రిటర్నింగ్ అధికారి చెల్లనివిగా పేర్కొన్న ఎనిమిది బ్యాలట్ పత్రాలను పరిశీలనలోకి తీసుకుని ఫలితాలు ప్రకటించాలని తాము ఆదేశిస్తామని సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది. ‘లోపభూయిష్ట ప్రవర్తన’కు రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రాసిక్యూషన్‌ను కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News