Sunday, April 28, 2024

రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా గుజరాత్ నుంచి నడ్డా

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్ నామినేట్

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను గుజరాత్ నుంచి, రెండు రోజుల క్రితమే కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులుగా బిజెపి బుధవారం ప్రకటించింది. అశోక్ చవాన్ సోమవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మంగళవారం బిజెపిలో చేరారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల కోసం బిజెపి బుధవారం విడుదల చేసిన అభ్యర్థుల తాజా జాబితాలో నలుగురికి స్థానం దక్కింది. వీరిలో ఒకరు గుజరాత్ నుంచి, ముగ్గురు మహారాష్ట్ర నుంచి బరిలో నిలుస్తారు.

ప్రస్తుతం హమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడినగా కొనసాగుతున్న జెపి నడ్డాకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లేదు. గుజరాత్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు మాన్సుఖ్ మాండవీయ, పరుషోత్తం రూపాలను పార్టీలకు బిజెపి ఈసారి అవకాశం కల్పించలేదు. వారిని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News