Tuesday, April 30, 2024

వొక్కలిగ కులస్తులను రెచ్చగొడుతున్నారు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వొక్కలిగ ముఖ్యమంత్రిని పదవీచ్యుతుడిని చేయడంలో బిజెపి పాత్రపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుఆర్ చేసిన ఆరోపణలను కర్నాటక బిజెపి శుక్రవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తమపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారని ఇసికి బిజెపి ఫిర్యాదు చేసింది. వొక్కలిగ ముఖ్యమంత్రి అని డికె శివకుమార్ ప్రస్తావించింది హెచ్‌డి కుమారస్వామిని. 2019లో కుమారస్వామి సారథ్యంలోని జెడిఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

కర్నాటకలో వొక్కలిగ కులస్తులు మంచి పలుకుబడి, ప్రాబల్యమున్న వ్యవసాయ వర్గానికి చెందినవారు. శివకుమార్ వ్యాఖ్యల వల్ల వొక్కలిగ వర్గానికి చెందిన సభ్యులకు, లక్షలాది మంది అదదిచుంచనగిరి స్వామీజీ అనుచరులకు మధ్య విభేదాలు సృష్టించగలవని బిజెపి తన ఫిర్యాదులో పేర్కొంది. వొక్కలిగ కులం వారు కాని ఆదిచుంచనగిరి స్వామీజీ కాని అమాయకులు కాదని, వొక్కలిగ ముఖ్యమంత్రి(కుమారస్వామి)ని దించడంలో బిజెపి నాయకులైన ఎహెచ్ విశ్వనాథ్, నారాయణ గౌడ, ఆర్ అశోక, అశ్వథ్ నారాయణ్, సిపి యోగేశ్వర, బిఎస్ ఎడియూరప్ప పాత్రను వారు మరచిపోలేదని శఙవకుమార్ వ్యాఖ్యానించినట్లు బిజెపి తన ఫిర్యాదులో పేర్కొంది.

రాజకీయ నాయకులను విమర్శించడం ద్వారా శివకుమార్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, కుల ప్రాతిపదికన తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలు ముఖ్యంగా వొక్కలిగ వర్గంవారి మనోభావాలను రెచ్చగొడుతున్నారని శివకుమార్‌పై బిజెపి ఫిర్యాదు చేసింది. శివకుమార్ ఆరోపణలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బిజెపి కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News