Saturday, July 27, 2024

రేపు బిజెపి నూతన అధ్యక్షుడి ఎన్నిక.. మళ్లీ నడ్డానే?

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: అమిత్ షా స్థానంలో సోమవారం కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు బిజెపి సర్వసన్నద్ధంగా ఉంది. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జెపి నడ్డా ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని భావిస్తున్నారు. నడ్డాకు మద్దతుగా నామినేషన్లు వేసేందుకు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో సహా పార్టీ అగ్రశ్రేణి నాయకులు బిజెపి కేంద్ర కార్యాలయానికి చేరుకోవచ్చు.

ఆ పదవికి నడ్డా అయితే సరైన వ్యక్తి అని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా కాలం నుంచి భావిస్తున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇన్‌ఛార్జి, బిజెపి సీనియర్ నాయకుడు రాధా మోహన్ సింగ్ మాట్లాడుతూ ‘పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు జనవరి 20న నామినేషన్లు దాఖలవుతాయి. అవసరమైతే, ఆ మర్నాడు ఎన్నిక ఉంటుంది. పోటీ లేకుండా, పార్టీ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం బిజెపి సంప్రదాయం. ఈసారి అందుకు కాస్త భిన్నంగా జరిగే అవకాశం కూడా లేకపోలేదు.

BJP Get new president tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News