Thursday, May 9, 2024

నడ్డా పదవీ కాలం పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకు పొడిగించడమైంది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా జనవరిలో ప్రకటించిన ఈ నిర్ణయాన్ని పార్టీ జాతీయ మండలి ఆదివారం ఆమోదించింది. అంతే కాదు. గణనీయమైన నిర్ణయాలు తీసుకోవడానికి జెపి నడ్డాకు అధికారం మంజూరైంది. అయితే, పార్టీ పార్లమెంటరీ బోర్డ్ ఆ తరువాత వాటిని ఆమోదించవలసి ఉంటుంది. ఢిల్లీలో బిజెపి జాతీయ మండలి సమావేశం రెండవ రోజు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని, ప్రచార లక్షాలను చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీ అగ్ర నాయకత్వంతో పాటు వేలాది మంది పార్టీ సభ్యులు హాజరయ్యారు.

బిజెపి అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షా 2019లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి కాగా, జెపి నడ్డా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. నడ్డా 2020లో పూర్తి కాలపు పార్టీ అధ్యక్షత్వం స్వీకరించారు. అమిత్ షా జనవరిలో బిజెపి జాతీయ అధ్యక్షుడుగా నడ్డా పదవీ కాలం పొడిగింపును ప్రకటిస్తూ, ‘జెపి నడ్డా నాయకత్వంలో మేము బీహార్‌లో అత్యధిక ఫలితాలు సాధించాం. ఎన్‌డిఎ మహారాష్ట్రలో మెజారిటీ సాధించింది, ఉత్తర ప్రదేశ్‌లో గెలిచింది, పశ్చిమ బెంగాల్‌లో మా బలం పెరిగింది. మేము గుజరాత్‌లో కూడా అఖండ విజయం సాధించాం’ అని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News