Monday, April 29, 2024

అలా చేస్తే నగరమంతా కలుషితమవుతుంది: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫార్మా సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని, అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపెనీ ఏర్పాటు సరైనది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే ప్రాంతములో 25 వేల ఎకరాల్లో ఫార్మాను తీసుకొస్తే నగరమంతా కలుషితమవుతుందని, అందువల్ల క్లస్టర్లా వారీగా ఫార్మను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ చుట్టూ టౌన్ షిప్స్ నిర్మాణానికి నిర్మాణ సంస్థలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

ఆదివారం రంగారెడ్డి జిల్లా నానక్ రాం గుడలో తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ప్రధాన కార్యాలయ భవనమును ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ప్రారంభించారు, అనంతరం (వర్చువల్) కార్యక్రమం ద్వారా సనత్ నగర్ అగ్నిమాపక  ఆఫీస్ ను ప్రారంబించి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ జర్నల్ నాగిరెడ్డి, క్రిడై అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కిమ్స్  చైర్మన్ అండ్ మేనజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు, ఆధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ… అగ్ని మాపక ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అగ్నిమాపక శాఖ కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, రోడ్ ప్రమాదాలు, వరదలు, భవనలు కులినప్పుడు, తదితర విపత్కర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందించడం, ప్రాణాలు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడడం లో అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని రేవంత్ ప్రశంసించారు. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని గత ప్రభుత్వాలు అభివృద్ధిలో ఎంతో అభివృద్ధి చేశారాన్నారు. రాజకీయాలకు అతీతంగా
గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలును ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకోస్తామని, రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైళ్లు సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది, 2050 మెగా మాస్టర్ ప్లాన్  ద్వారా ముందుకు పోతామన్నారు. అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణను సైతం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

17 కోట్లతో తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ప్రధాన కార్యాలయ భవనమును నిర్మించిన క్రిడై హైదరాబాద్ వారిని, సనత్ నగర్ అగ్నిమాపక  ఆఫీస్ ను 1.5 కోట్లతో నిర్మించిన కిమ్స్,   చైర్మన్ అండ్ మేనజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావులను ముఖ్యమంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ జర్నల్ నాగిరెడ్డి, హోం సెక్రెటరీ జితేంద్ర, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ శాలిని మిశ్రా, క్రిడై అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి,  కిమ్స్  చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు, ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ ఆధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News