Tuesday, October 15, 2024

కంగనపై బిజెపి చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

రైతు నేత పంధేర్ డిమాండ్

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం 2021లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలపై వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి కంగనా రనౌత్‌పై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌కు చెందిన కిసాన్ మజ్దూర్ మోర్చ అధ్యక్షుడు స్వరణ్ సింగ్ పంధేర్ బుధవారం డిమాండ్ చేశారు. గతంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ వ్యాఖ్యానించి ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కంగనా రనౌత్ ఎక్స్ వేదికగా అవి తన వ్యక్తిగత వ్యాఖ్యలని, వాటితో తన పార్టీకి సంబంధం లేదని ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు.

దీనిపై పంధేర్ స్పందిస్తూ బిజెపి టిక్కెట్‌పై ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేసి కంగన గెలిచారని గుర్తు చేశారు. ఆ చట్టాలను బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఇదివరకు రద్దు చేయగా ఆ పార్టీ ఎంపి ఆ చట్టాలపై ప్రకటన చేసినందున ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన బిజెపిని డిమాండు చేశారు. విధాన అంశాలపై ఎవరైనా మాట్లాడి అది తన వ్యక్తిగత అభిప్రాయమని అంటే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంలో బిజెపి వైఖరి బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News