Thursday, October 10, 2024

పాలమూరు-రంగారెడ్డికి రూ.27500 కోట్లు కేటాయింపు: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల: మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. గట్టు, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని, గత ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డికి రూ. 27500 కోట్లు కేటాయించామని ఉత్తమ్ పేర్కొన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులతో కలిసి బుధవారం సందర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు అక్కడికక్కడే పలు నిర్ణయాలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News