Friday, September 22, 2023

చీర్యాల్‌లో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

కీసర: కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని చీర్యాల్ గ్రామ ంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సర్వే నంబరు 62లోని రేగు కృష్ణకు సంబంధించిన వ్యవసాయ పొలంలో కుల్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. నలుపు రంగు జర్కిన్, పట్టు బార్డర్ రంగు చీర ధరించిన మృతురాలి వయస్సు 45 నుండి 50 సంవత్సరాలు ఉంటుందని, 3, 4 రోజుల క్రితం మృతి చెంది ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు కీసర పోలీసులను 8712662191, 9712662107, 97126 62114 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News