Monday, April 29, 2024

బాలీవుడ్ గాయని అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బాలీవుడ్ ప్రముఖ గాయని అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరారు. శనివారం నాడిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. సనాతన ధర్మానికి కట్టుబడిన బీజేపీలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా పౌడ్వాల్ పేర్కొన్నారు. పౌడ్వాల్ వివిధ భాషల్లో వందలాది పాటలు, భజనలు పాడారు. కర్ణాటక లోని క్వారాల్‌లో జన్మించిన ఆమె 19 వ ఏటనే అభిమాన్ చిత్రంలో ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో ఓంకారం బిందు సంయుక్తం అనే పాటతో మంచిపేరు తెచ్చుకున్నారు.

1983లో హీరో చిత్రంలో ఆమె పాడిన తూ మేరా హీరో హై పాట సూపర్ హిట్ అయింది. ఆ తరువాత నాలుగుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2000 తరువాత ఎక్కువగా భక్తి గీతాలపై ఆమె దృష్టిసారించారు. 2016లో సూర్యోదయ ఫౌండేషన్‌ను స్థాపించి పేదలకు హెల్త్‌కేర్ సేవలు అందించారు. 2011లో మదర్ థెరెస్సా అవార్డును అందుకున్నారు. 2017లో పద్మశ్రీ పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News