Sunday, April 28, 2024

జపాన్ ప్రధానిపై బాంబు దాడి..

- Advertisement -
- Advertisement -

టోక్యో: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.ఆయన పాల్గొన్న కార్యక్రమ వేదికకు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.అయితే అధికారులు అప్రమత్తమై ఆయనను వెంటనే అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ప్రధానికి ఎలాంటి హానీ సంభవించలేదు. కిషిదా శనివారం వకయామలోని సైకాజకి పోర్టు ప్రాంతంలో పర్యటించారు. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతుగా ఆయన అక్కడ పర్యటించారు. మరి కాస్సేపట్లో ప్రధాని ప్రసంగించాల్సి ఉండగా వేదికకు సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో అంతా ఉలిక్కి పడిన జనం భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు ఆయనను అక్కడినుంచి తరలించారు.

Also Read: బ్రతుకు తెరువు కోసం వచ్చి.. కారేపల్లి ఘటనలో బలైనాడు

ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంనుంచి ఓ యువకుడు పారిపోతుండగా భద్రతా సిబ్బంది అతడ్ని పట్టుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బైటికి వచ్చారు. ఆ యువకుడే ప్రధాని ఉన్న వేదికపైకి ‘ స్మోక్ బాంబు’ విసిరినట్లు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. జపాన్ మాజీ ప్రధాని షింజే అబే హత్య జరిగిన కొద్ది నెలల వ్యవధిలోనే ప్రధానిపై మరోసారి దాడి జరగడం గమనార్హం. 2022 జులైలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కూడలి వద్ద షింజో ప్రసంగిస్తుండగా దుండగుడు ఆయనపై అత్యంత సమీపంనుంచి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అబే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కాగా మరికొద్ది రోజుల్లో జపాన్‌లో జి7 దేశాల మంత్రుల సమావేశాలు జరగనుండగా ఈ బాంబుదాడి ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. కాగా జపాన్ ప్రధానిపై బాంబు దాడి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన క్షేమంగా బైటపడినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News