Monday, July 22, 2024

ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..13 ఏళ్ల బాలుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

దుబాయ్ విమానానికి బాంబు పెట్టారని బెదిరిస్తూ ఢిల్లీ విమానాశ్రయానికి ఇ మెయిల్ పంపిన 13 ఏళ్ల బాలుడిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితం ఉత్త బాంబు బెదిరింపుతో భయపెట్టిన టీనేజ్ కుర్రవాడి సమాచారానికి ఈ బాలుడు ప్రభావితమైనట్టు తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఐజిఐ ఎయిర్‌పోర్టు) ఉషా రంగ్‌నాని చెప్పారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. జూన్ 18న దుబాయ్ వెళ్లే విమానానికి బాంబు బెదిరింపుపై మొత్తం విమానాశ్రయాణ్ణి అప్రమత్తం చేశారు. ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే దర్యాప్తులో బాలుడు పంపిన ఈ మెయిల్ ఉత్తదేనని బయటపడింది.

ఈమెయిల్ పంపిన తరువాత బాలుడు తన ఈ మెయిల్ ఐడీని తొలగించినట్టు రంగ్‌నాని తెలిపారు. .అయితే ఉత్తరాంచల్ లోని పిథోరాగడ్ వద్ద తొలగించిన ఈమెయిల్‌ను రాబట్ట గలిగారు. “ స్టడీ ప్రయోజనం కోసం తన తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ ఇచ్చారని, కానీ ఈ ఫోన్ ద్వారానే ఈ మెయిల్ కేవలం సరదాగా పంపించానని, తరువాత తన ఐడిని తొలగించానని బాలుడు చెప్పాడు” అని ఉషారంగ్‌నాని తెలియజేశారు. అయితే ఈ సమాచారాన్ని బాలుడు తన తల్లిదండ్రులకు కూడా తెలియజేయలేదని చెప్పినట్టు ఉషారంగ్‌నాని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News