Friday, May 3, 2024

ఆస్పత్రుల్లో మృత్యుఘోష పై బాంబే హైకోర్టు సీరియస్

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్ర ఆస్పత్రుల్లో మృత్యుఘోషను బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. నాందేడ్‌తోపాటు ఛత్రపతి శంభాజీనగర్ ఆస్పత్రుల్లో వరుసగా రోగులు మృత్యువాత పడటాన్ని సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ ఆరిఫ్ ఎస్ డాక్టర్‌లతో కూడిన డివిజన్ బెంచ్, బడ్జెట్‌లో ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత కేటాయించింది? పెట్టిన ఖర్చు..? తదితర వివరాలు తెలపాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. గత మూడు రోజులుగా నాందేడ్ ఆస్పత్రిల్లో 31 మంది, శంభాజీ నగర్‌లోని ఆస్పత్రిలో 18 మంది చనిపోవడంపై మోహిత్‌ఖన్నా అనే న్యాయవాది బాంబే హైకోర్టుకు లేఖ రాశారు.

దానిని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఓ పిటిషన్ దాఖలు చేయాలని, తద్వారా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. ఆస్పత్రుల్లో ఖాళీలు, ఔషధాల లభ్యత, ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని సూచించింది. బుధవారం విచారణలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. ఆస్పత్రి పడకలు, సిబ్బంది,అత్యవసర ఔషధాల కొరత ఉన్నట్టు వైద్యులు చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై శుక్రవారం విచారణ జరుపుతామని, ఆ లోపు వివరాలన్నీ తమ ముందుంచాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News