Monday, April 29, 2024

సైకమోర్ గ్యాప్ వృక్షం నరికి వేత..

- Advertisement -
- Advertisement -

లండన్: ప్రకృతి అందాలకు కేంద్రమైన బ్రిటన్‌లోని సైకమోర్ గ్యాప్‌లో ఉన్న భారీ వృక్షాన్ని కూల్చేశారు. ఓ బాలుడు రాత్రికి రాత్రి దాన్ని నరికేశాడు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికుల్లో కలవరం రేపుతోంది. పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కొండల మధ్య ఒకే ఒక వృక్షం ఠీవిగా నిలిచి ఉండే దృశ్యాన్ని మనం తరచూ ఇంటర్నెట్‌లో చూస్తుంటాం. ఈ ప్రదేశం బ్రిటన్‌లోని నార్తంబర్లాండ్‌లోని చారిత్రక హాండ్రియన్ వాల్ వద్ద ఉంది. ఈ వృక్షం వయసు 200 ఏళ్లకు పైగానే ఉంటుంది.

1900 సంవత్సరాల క్రితం రోమన్లు నిర్మించిన మాండ్లియర్ వాల్ యునెస్కో చారిత్రక వారసత్వ సంపదల జాబితాలో నిలిచింది కూడా.‘ రాబిన్ ప్రిన్స్ ఆఫ్ థీవ్స్’ చిత్రంలో కూడా ఇది కనిపిస్తుంది. సైకమోర్ గ్యాప్‌లోని ఈ వృక్షం ఉండే ప్రాంతం బ్రిటన్‌లోనే అత్యధికంగా ఫొటోలు తీసిన ప్రాంతంగానిలిచింది. దీనిని 2016లో ‘ఇంగ్లీషు ట్రీ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేశారు కూడా.అయితే ఈ ప్రాంతాన్ని నిర్వహిస్తున్న నేషనల్ ట్రస్ట్ ఆఫ్ హెరిటేజ్ చారిటీ మాత్రం చెట్టు నరికి వేతపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పోలీసులు 16 ఏళ్ల బాలుడ్నిఅరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ బాలుడు విచారణకు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News