Sunday, May 5, 2024

లండన్ ఐకానిక్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ జామ్..

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లోని ప్రఖ్యాత టవర్ బ్రిడ్జ్ వద్ద గురువారం అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. నదిలో పడవ ప్రయాణం కోసం దారి ఇచ్చేందుకు పైకి లేచిన బ్రిడ్జ్‌లో లోపం తలెత్తడంతో అది యథాస్థానానికి చేరుకోలేదు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.లండన్‌లోని థేమ్స నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ అటు నదీ రవాణాకు, ఇటు ప్రజా ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. గురువారం మధ్యాహ్నం ఓ బోటు వెళ్లడం కోసం బ్రిడ్జ్ మధ్య భాగాన్ని పైకి లేపారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియే. అయితే పైకి వెళ్లిన భాగం బోటు వెళ్లిన తర్వాత కిందికి దిగాలి. కానీ సాంకేతిక లోపం కారణంగా అది యథాస్థానానికి రాలేదు.

దీంతో రోడ్డునుంచి వంతెన మీదుగా వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అదికాస్తా లండన్ వీధుల్లో ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. అరగంట తర్వాత బ్రిడ్జ్ యథాస్థానానికి రావడంతో ట్రాఫిక్ అంతరాయం తొలగిపోయిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. థేమ్స్ నదిపై ఈ కదిలే బ్రిడ్జ్ నిర్మాణం 1894లో పూర్తయింది. దీని జంట టవర్లు నదికి 61 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ రెండింటి మధ్య నిర్మించిన స్కైవాక్ ప్రతేక ఆకరషణగా ఉంటుంది. అక్కడినుంచి కిందికి చూస్తే రహదారిపై వెళ్లే వాహనాలు, కింద నీటిలో ప్రయాణించే పడవలు కనిపిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News