Wednesday, December 6, 2023

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి అపహరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. బాలుడిని ఇద్దరు దుండగులు అపహరించారు. బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురం గ్రామానికి చెందిన దుర్గేశ్ తన కుమారుడితో కలిసి తిరుమలకు వెళ్లారు. ఈ నెల 28న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. బాగా అలసి పోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దుర్గేష్ పడుకున్నాడు. సాయంత్రం 4.30 ప్లాట్ పామ్ నెంబర్ వన్ వద్ద తన కుమారుడిని బ్యాగుల వద్ద ఉంచి వాష్‌రూమ్‌కు వెళ్లారు. వచ్చి చూసేలోపు బాబు కనిపించకపోవడంతో జిఆర్‌పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News