Friday, May 3, 2024

బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బిజెపి ఎంపి, డబ్లూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బెయిల్ లభించింది. ఢిల్లీలోని స్థానిక రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం రూ.25,000 పూచీకత్తుతో 2 రోజుల మధ్యంతర బెయిల్ కు అనుమతించింది. ఇదే కేసుకు సంబంధించి ఎంపీకి సహకరించారన్న ఆరోపణల కేసులో డబ్య్లూఎఫ్‌ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కి కూడా మధ్యంతర బెయిల్ లభించింది.

అయితే సాధారణ బెయిల్ పిటిషన్‌పై గురువారం నుంచి వాదనలు జరగనున్నాయి. బెయిల్ మంజూరు సందర్భంగా మీడియా ప్రతినిధులకు కూడా కోర్టు సూచనలు చేసింది. ఈ కేసుకు సంబంధించి రిపోర్టింగ్ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. న్యాయమూర్తుల వ్యాఖ్యలు అపార్ధాలు వచ్చేట్లు ప్రచురించవద్దని తెలిపింది. ఓ మైనర్‌తో సహా ఆరుగురు రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై ఏప్రిల్ నెలలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జూన్ 2న ఢిల్లీ పోలీసులు 2 ఎఫ్‌ఐఆర్ లు, 10 ఫిర్యాదులను స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News